IndiGo Sharjah-Hyderabad flight: ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక లోపం కారణంగా పాకిస్తాన్ కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. యూఏఈ షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సమీపంలో ఉన్న కరాచీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. ఇండిగో ఫ్లైట్ 6ఈ-1406 విమానం షార్జా నుంచి బయలుదేరిన కొంత సేపటికి పైలెట్లు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు.