టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదటి నుండి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలను ఓసారి చూస్తే… ఈ విషయం అర్థమౌతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలనూ రూపొందించిన క్రిష్ కు పరభాషా చిత్రాలను రీమేక్ చేసి తెలుగువారికి అందించడం కూడా ఇష్టమే. ఆయన దర్శకత్వం వహించకపోయినా అలా కొన్ని తమిళ చిత్రాలను తెలుగువారి ముందుకు క్రిష్ తీసుకొచ్చారు. అలానే నవలలను సినిమాలుగా తీయడం ఆయనకు ఇష్టం. ఆ…