Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి.
Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే…
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్వర్ యాత్రికుల కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కన్వర్ యాత్ర రూట్లలోని హోటళ్లు నేమ్ ప్లేట్స్ ప్రదర్శించాల్సిందేనని యూపీ సీఎం స్పష్టం చేశారు.
UTTAR PRADESH: ఉత్తర్ ప్రదేశ్‌లో శివభక్తులు చేసే ‘కన్వర్ యాత్ర’కు ముజఫర్ నగర్ పోలీసులు పెట్టిన రూల్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. యాత్రా మార్గంలో తినుబండారాల విక్రేతలు తమ పేర్లను తప్పకుండా ప్రదర్శించాలని యూపీ పోలీసులు ఆదేశించారు.
పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శివభక్తులు గ్వాలియర్ నుంచి యూపీలోని హరిద్వార్ మీదుగా తమ సొంత జిల్లాకు వెళ్తుండగా.. హత్రాస్‌లోని సదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్లిన ఏడుగురు భక్తులను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
కన్వర్ యాత్రకు యూపీ అనుమతులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే, ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహాశివుడి భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్కడి పవిత్రమైన గంగానది జలాలను తీసుకొని వస్తారు. వాటిని స్థానికంగా ఉండే శివాలయంలో మహాశివునికి అభిషేకిస్తారు. ఈ యాత్ర ప్రతి…