ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన ఘటన కాన్పూర్ లో జరిగింది. మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. ప్రభుత్వ అధికారిపై కోపంతో ఫైలు విసిరింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్ ప్రమీలా పాండే డ్రైనేజీ వ్యవస్థల పరిశుభ్రత, ఇతర సంబంధిత విషయాల గురించి కాన్పూర్ నగర్ నిగమ్ సమావేశానికి హాజరయ్యారు. డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.