President Murmu: కర్ణాటక మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఆహ్లాదకరమైన సంభాషణకు వేదికగా మారింది. ‘‘మీకు కన్నడ తెలుసా.?’’ అని సీఎం, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ఇందుకు ఆమె ‘‘తనకు భాష తెలియదని, అయితే నేర్చుకుంటానని మాత్రం హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
Thuglife : అవును.. ఒక్క క్షమాపణ విలువ రూ.12 కోట్లు. కన్నడ భాషపై చేసిన వివాదాస్పద కామెంట్ల విషయంలో కమల్ హాసన్ అస్సలు తగ్గట్లేదు. కన్నడ ఇండస్ట్రీ మొత్తం వ్యరేకించినా సరే తన నిర్ణయం మార్చుకోవట్లేదు. హైకోర్టు సీరియస్ అయినా వెనకడుగు వేయట్లేదు. తన వ్యాఖ్యలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నాడే తప్ప.. ఒక్క క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోవట్లేదు. కోర్టు అడిగినా సరే తగ్గకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవసరం అయితే తన సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయను…
Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.
Kamal Haasan: భాషాభిమానానికి కర్ణాటక, తమిళనాడు పెట్టింది పేరు. అలాంటి చోట భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
Tamannaah : తమన్నాపై నటి రమ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తమను కాదని తమన్నాను తీసుకుంటారా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం కర్ణాటకలో కన్నడ భాష ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైసూర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఇప్పటికే వివాదం చెలరేగుతోంది. తాజాగా నటి రమ్య ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. తమన్నాను తీసుకోవడం కరెక్ట్…
బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.