కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా ‘భైరవన కోనే పాఠ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సప్త సాగరాలు దాటి రెండు భాగాలతో కన్నడతో పాటు తెలుగులో సూపర్ హిట్ కొట్టిన హేమంత్ రావు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రానికి సంబంధించి శివన్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. తెలుగులో భైరవుని చివరి పాఠం పేరుతో తీసుకువస్తున్న ఈ చిత్రానికి లెసన్ ఫ్రమ్ ఏ కింగ్… అనేది ఉపశీర్షిక.…