కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా ‘భైరవన కోనే పాఠ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సప్త సాగరాలు దాటి రెండు భాగాలతో కన్నడతో పాటు తెలుగులో సూపర్ హిట్ కొట్టిన హేమంత్ రావు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రానికి సంబంధించి శివన్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. తెలుగులో భైరవుని చివరి పాఠం పేరుతో తీసుకువస్తున్న ఈ చిత్రానికి లెసన్ ఫ్రమ్ ఏ కింగ్… అనేది ఉపశీర్షిక. భైరవగా టైటిల్ పాత్రలో శివ రాజ్ కుమార్ కనిపించనున్నారు..
ఇటీవల జైలర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించారు శివరాజ్ కుమార్. కాగా నేడు విడుదలైన ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మెరిసిన తెల్లటి గుబురు గడ్డం, మీసాలు, భుజంపై బాణాలు, అలాగే అతని వైపు దూసుకొస్తున్న మరి కొన్ని బాణాలు, గుర్రం, చేతిలో బైనాక్యూలర్ తదితర వాటిని చూస్తుంటే ఇదేదో పీరియాడికల్ సినిమాలా అనిపిస్తోంది. శివన్న కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతోంది. భైరవన కోనే పాఠ చిత్రాన్ని వైశాఖ జె ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ వైశాఖ్ కె గౌడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో సినిమా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ కన్నడలో రెండు చిత్రాలు, తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అవి పూర్తి అయ్యాక ‘భైరవన కోనే పాఠ’ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబరులో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న శివ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ మీరు ఓ సారి చూసేయండి.
Also Read: Dhanush rayan : పెద్దలకు మాత్రమే…వారికి నో ఎంట్రీ…