OFF The Record: ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో చేసిన కామెంట్స్‌తో ప్రస్తుత బాస్ సోము వీర్రాజుకు బాగా కాలుతోందా? అందుకే సొంత జిల్లా నేతలకు వీర్రాజు గట్టిగా క్లాస్ పీకారా? ఇంతకీ ఇద్దరి మధ్య కొత్తగా పొగ పెట్టిన అంశాలేంటి? ఏం జరిగింది? కన్నాకు గౌరవ మర్యాదలతో స్వాగతం చెప్పిన కాకినాడ జిల్లా బీజేపీ నేతలు? కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కన్నా తర్వాత ఆ పదవి సోము…
Kanna Lakshmi Narayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మరోసారి ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఇప్పుడు తొలగించిన వాళ్లను గతంలో తానే నియమించానని.. అధ్యక్షుల మార్పు అంశాన్ని అసలు తనతో చర్చించకపోవడం సమంజసం కాదన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమందిని పార్టీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం…
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో కోరారు.
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన…
Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం…
గృహహింస కేసులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.…
ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ…