గృహ హింస కేసులో కన్నా కోడలికి రూ.కోటి పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గృహహింస కేసులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీలక్ష్మీ కీర్తికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని కన్నా కుమారుడిని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. శ్రీలక్ష్మీ కీర్తి పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు.
Read Also: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. పలు విమానాలు రద్దు
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
వివరాల్లోకి వెళ్తే… కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మీ కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి నాగరాజు తల్లి విజయలక్ష్మీకి ఇష్టం లేదు. కానీ వివాహం జరిగిన తర్వాత కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీలక్ష్మీ కీర్తి 2013లో ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే వివాదాల కారణంగా 2015లో తల్లీబిడ్డను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు విజయవాడలోని మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించింది. గృహ హింస పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పరిహారంతొ పాటు శ్రీలక్ష్మీ కీర్తితో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. తీర్పు ఉత్తర్వులు వెలువడిన మూడు నెలల్లోపు ఆదేశాలన్నీ అమలు చేయాలని.. లేకపోతే చర్యలు తప్పవంటూ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా కన్నా రెండో కోడలు సుహారిక 2020లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!