ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు.
ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఈ కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా.. ఇటీవల వాళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా యువతి మృతదేహం శవపరీక్ష పూర్తి అయింది
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.