Delhi Accident Case Eyewitness Nidhi Sas Arrested In Drug Smuggling Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ రోడ్డు ప్రమాదం కేసులో.. రోజుకో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ప్రమాదంలో అత్యంత ఘోరంగా మృతి చెందిన అంజలి.. ఆరోజు రాత్రి ఒంటరిగానే ప్రయాణిస్తుందని తొలుత అనుకున్నారు. కానీ.. ఆమెతో పాటు నిధి అనే స్నేహితురాలు కూడా ఉందని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు తేల్చాయి. ఆమె ఆచూకీ కనుగొని సీన్‌లోకి తీసుకురాగా.. అంజలి మద్యం సేవించిందని నిధి కుండబద్దలు కొట్టింది. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్‌లో మాత్రం అంజలి మద్యం సేవించలేదని తేలింది. ఇదే సమయంలో నిధి ఎవరో తమకు తెలియదంటూ.. అంజలి కుటుంబ సభ్యులు బాంబ్ పేల్చారు.
Yash: మీ ఎదురు చూపుకి న్యాయం చేస్తాను… వెయిట్ చెయ్యండి…
ఇలా త్రిల్లర్ సినిమాకి మంచి ట్విస్టులతో సాగుతున్న ఈ కేసులో.. తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నిధి వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా.. ఆమె 2020లోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తేలింది. 2020 డిసెంబర్ 6వ తేదీన తెలంగాణ నుంచి డ్రగ్స్ తరలిస్తూ.. ఆగ్రా రైల్వే స్టేషన్‌లో నిధి అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు సమీర్, రవి అనే ఇద్దరు యువకులు సైతం అరెస్ట్ అయ్యారు. దీంతో.. నిధిపై పోలీసులు మరింత నిఘా పెంచారు. మరోవైపు.. ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో నిధి అరెస్ట్ అయినట్టు వార్తలు రాగా, కేవలం విచారణ కోసమే ఆమెని పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు నుంచి అయితే నిధి సేఫ్ కానీ, లేటెస్ట్‌గా తెరమీదకి వచ్చిన డ్రగ్స్ కేసులోనే ఆమెకి ఏమైనా చుక్కెదురు కావొచ్చు.
Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ
కాగా.. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సుల్తాన్‌పురి సమీపంలో అంజలి స్కూటీని ఢీకొట్టిన కారు, ఆమెను 12 కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో తప్పుడు సమాచారం అందించిన ఆరో నిందితుడు ఆశుతోష్‌ని సైతం అరెస్ట్ చేశారు. తొలుత ఈ కేసులో దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్‌లను అరెస్టు చేశారు. వీళ్లు ఆశుతోష్ నుంచి అప్పుగా తీసుకున్న కారును నడిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఐదుగురు పూటుగా మద్యం సేవించారు. ఆశుతోష్, ఆంకుష్ ఖన్నా కలిసి నిందితులైన తమ స్నేహితుల్ని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో, వాళ్లని అరెస్ట్ చేశారు. మొత్తం 18 పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.