ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్‌గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్‌కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్ ఎవరు?