తేనె కన్నా తియ్యనిది... తెలుగు భాష' అంటూ మనం పొంగిపోతూ పాడుకుంటూ ఉంటాం. అయితే తెలుగులోని తీయదనాన్ని నిజంగా గ్రోలినవారు పరభాషకు చెందినవారేనని పెద్దలు చెబుతారు. తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి 'తెలుంగు తీయదనం' గురించి చెప్పిన వైనాన్ని ఏ తమిళుడూ మరచిపోరాదంటారు విలక్షణ నటుడు కమల్ హాసన్.