తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్‌కు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత…