Kamal Haasan: డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌హాసన్..
- డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌హాసన్
- 2024 లోక్‌సభ ఎన్నికల వేళ డీఎంకే, ఎంఎన్ఎం మధ్య ఒప్పందం
- ఒప్పందం ప్రకారం కమల్‌ను పెద్దలసభకు పంపనున్న డీఎంకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అధికార డిఎంకెతో ఎన్నికల ఒప్పందం తర్వాత మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు స్థానాలకు ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన మక్కల్ నీది మయ్యం పార్టీ డిఎంకె నేతృత్వంలోని కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కమల్ హాసన్‌కు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదా ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించే విధంగా ఒప్పందం కుదిరింది.
Also Read:NTR AI Speech: మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్.. భళా మనవడా.. భళా..
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
70 ఏళ్ల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వైదొలిగారు. అయినప్పటికీ ఆయన పార్టీ తమిళనాడులో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చింది. ద్రవిడ పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకెలకు ప్రత్యామ్నాయంగా కమల్ హాసన్ 2018 లో ఎంఎన్ఎంను స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగిన పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ పార్లమెంటు అరంగేట్రం గురించి సూచనప్రాయంగా చెప్పారు.
Also Read:Robot Fightin: ప్రపంచంలోనే తొలిసారి.. రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్.. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం
తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎంపీలు – అన్బుమణి రామదాస్, ఎం షణ్ముగం, ఎన్ చంద్రశేఖరన్, ఎం మహ్మద్ అబ్దుల్లా, పి విల్సన్, వైకో – పదవీకాలం జూలై 25తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలం ప్రకారం, డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పార్టీ ఆరు రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. మిగిలిన రెండు స్థానాలు బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన అన్నాడీఎంకేకు వెళ్లే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు