Kanchi Kamakshi: తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులచే ఆరాధించబడుతోంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక వృత్తాంతాలు చెబుతున్నాయి. అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై కూర్చుని చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. ఇది ఆధ్యాత్మికంగా ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతని అందించింది. కాంచీపురం నాభిస్థాన…