అక్కినేని అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన కళ్యాణి ప్రియదర్శని ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. దాంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయి తమిళ,మలయాల చిత్రాలపై శ్రద్ధ చూపిస్తోంది. మలయాళంలో మొదటి సినిమా ‘మరక్కార్’ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా,…