Tollywood : ఇప్పటికైనా ఆ హీరోయిన్ ను టాలీవుడ్ దర్శకులు గుర్తిస్తారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన కళ్యాణి ప్రియదర్శని ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. దాంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయి తమిళ,మలయాల చిత్రాలపై శ్రద్ధ చూపిస్తోంది. మలయాళంలో మొదటి సినిమా ‘మరక్కార్’ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, ఆంటోనీ, వర్షంగళక్కు శేషం లాంటి సినిమాలతో కళ్యాణికి మలయాళ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కళ్యాణి తమళ్‌లో జీని, కార్తి 29 ఉన్నాయి.
Also Read : Karthi : ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కార్తీ..
Also Read
తాజాగా మళయాలంలో ఫహద్ ఫాజిల్‌తో ఒడుం కుతిర చద్దాం కుతిరా, దుల్కర్ సల్మాన్‌తో వే ఫారర్ ఫిలింస్ బ్యానర్‌పై ‘లోక’ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. లోక కేరళలో ఓనం కానుకగా రిలీజ్ అయి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే తొలి అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌ని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు అప్పట్లో కళ్యాణిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మలయాళంలో తన అద్భుతమైన నటనతో అదరగొడుతుంది. మళ్లీ టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇవ్వాలంటే, ఒక బలమైన స్క్రిప్ట్, మంచి కంటెంట్ కావాలి. లేదంటే, కళ్యాణీ… టాలీవుడ్‌కి “హలో” చెప్పకుండా అక్కడే ఉండి పోయేలా ఉంది. టాలీవుడ్‌లో కేరళ ముద్దుగుమ్మలు అంటే ఎప్పుడూ క్రేజే . అందకే అందం అభినయం ఉన్న అమ్మాయిను భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. మరో సూపర్ ఉమెన్ గా అదరగొట్టిన కళ్యాణి ప్రియదర్శన్ ను తెలుగు దర్శకులు ఇప్పటికైనా గుర్తిస్తారో లేదో.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!