పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్,…
Kalti Kallu: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. సుమారు ఆరు రోజులుగా బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. 40 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చేరగా… వారిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవారిలో కోడూరుకు చెందిన అంజయ్య, అంబేద్కర్‌నగర్‌కు చెందిన విష్ణుతోపాటు మరొకరు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే,…