కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు.