Kaleshwaram Project: నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది.
బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పిల్లర్ ఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుండగా.. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాలని బీజేపీ సైతం కోరుతోంది. ఈ క్రమంలోనే.. 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం.. అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్…
మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది.. ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అన్నారం బ్యారేజీ వలన వరద ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామ పంట భూములను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్‌కు తమ బాధలు చెప్పుకుంటూ సుందరశాల గ్రామ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు. అవినీతి కేసీఆర్‌ను వెంటనే జైల్లో…
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముూడు రోజులుగా తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో చేపట్టిన సోదాలు ముగిశాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ , కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లకు సంబందించిన కీలక పత్రాలు సీజ్ చేశారు. అంతేకాకుండా.. ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. కాగా.. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్…
Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాల్లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం. ఈ కుంగుపాటుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఉన్న మంచి పేరు కాస్తా పోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాజెక్టు పేరు ఎత్తడానికే బీఆర్ఎస్ వెనకబడిపోయింది.