కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి…
చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా…