రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడని.. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం సేవించాడని ఎస్పీ వివరించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని తన కారులో తీసుకెళ్లారని చెప్పారు. సుబ్రహ్మణ్యం…