భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్‌డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్‌పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే…
హైదరాబాద్ అంటే ఓ ట్రాఫిక్ సముద్రం. ఈ సముద్రంలో ఈదుతూ ఆఫీస్ నుంచి ఇంటికో.. లేక కాలేజ్, స్కూల్ ఇలా ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లేసరికి ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరైపోతుటుంది. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం గ్రేటర్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మెట్రో ప్రారంభమైననాటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ సమస్య తీరినట్లు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో ఫ్లైఓవర్ గ్రేటర్‌వాసుల ట్రాఫిక్ కష్టాలను…