కడపలో మేయర్ సురేష్ బాబు వర్సెస్ కమిషనర్‌గా మారిపోయింది వ్యవహారం.. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉత్కంఠభహితంగా సాగింది.. ఉదయం నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అక్కడ నెలకొంది... మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కల్పించాలని సజావుగా నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలంటూ కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దాంతో సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, 8 మంది టీడీపీ కార్పోరేటర్లు, అధికారులు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వేచి ఉన్నారు. మరోవైపు మేయర్ చాంబర్‌లో వైసీపీకి చెందిన 39 మంది కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశలో సందిగ్దత నెలకొంది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే…
నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం జరిగే ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే.. బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఆరు నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే.. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్య అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం…
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో.... వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట.
వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కడప కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు కూడా రెడీ ఉన్నారని తెలుస్తోంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు మెల్లగా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిరసన మధ్య ప్రారంభం కాక ముందే ఆగిపోయింది. ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా క్రిందనే సీటు వేయడంపై మాధవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ హాలు లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలిపి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు
వైసీపీ కంచుకోటలో పాగా వేసేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. అసంతృప్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి రావడానికి ద్వారాలు తెరిచారట. అయితే, కడప కార్పొరేషన్.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2006లో కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. దీనికోసం కడప పట్టణానికి సమీపంలో ఉన్న పలు గ్రామాలను మెడ్జ్ చేశారు.