తమిళనాడులో విల్లుపురం జిల్లా, కడలూరు జిల్లా సరిహద్దు గ్రామాల వద్ధ దక్షిణ పెన్నానదిపై రూ.25 కోట్ల రూపాయలతో చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ డ్యామ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఏడాది జనవరి 23 వ తేదీన ఆనకట్ట క్రస్ట్‌గేట్ల గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. గోడ పగుళ్ల నుంచి నీరు బయటకు వస్తుండటంతో ఈ వ్యవహారంలో బాధ్యులను చేస్తూ ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Read: ఆ గుర్రానికి కోట్లు ఇస్తామన్నా… నో…