జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారు.. తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై పోటీ చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని.. 65 సీట్లు వస్తాయని చెప్పానని, అలానే వచ్చాయన్నారు కేఏ పాల్.
KA Paul: అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓడించి బర్రెలక్క ను గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో కేఏ పాల్ ప్రచారం నిర్వహించారు.
మెగా బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..…
KA PAul: నా పార్టీలో మందకృష్ణను చెరమంటే 25కోట్లు అడిగారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారు.
KA Paul: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా దృష్టి సారించిన ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి చిక్కులు ఎదురయ్యాయి. తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి కంచె ఎన్నికల గుర్తు రిజర్వ్ కాలేదు.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్‌గా ఉన్న ప్రజాశాంతి పార్టీని యాక్టివ్‌గా లేదని అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.