KA PAul: పార్టీలో చేరుమంటే రూ.25కోట్లు అడిగారు.. మందకృష్ణ పై పాల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA PAul: నా పార్టీలో మందకృష్ణను చెరమంటే 25కోట్లు అడిగారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అనివితి జరుగుతున్న దేశం ఇండియాగా మారిందన్నారు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హై కోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారు. కుటుంబ పాలన వద్దని అన్నారు. పెరేడ్ గ్రౌండ్లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు 72కోట్లు ముట్టాయని అన్నారు. నరేంద్ర మోడీ బీసీ కాదు.. మోడీ నా శిష్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ సర్టిఫికెట్లు అన్ని డుబ్లికెట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీకి కేఏ పాల్ భయపడడు అన్నారు. అధాని అప్పులను మోడీ కట్టకుండా మాఫీ చేశారని మండిపడ్డారు.
చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యకత్పురతో పాటు 13 సెగ్మెట్లలో నా అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడు పోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నా పార్టీలో మందకృష్ణను చెరమంటే 25కోట్లు అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని ఘోరమైన తిట్లు తిట్టి మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోడీ దేవుడు అని అంటున్నారని మండిపడ్డారు. మందకృష్ణ మాదిగకు ఒక ఎంపీ ఇస్తారని మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని తెలిపారు. మూడు పార్టీలకు ఓట్లు వేయకండి..30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోవాలని సూచించారు. మాదిగలకు మోడీ ఇన్ని రోజులకు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు.
Uttarkashi Tunnel : టన్నెల్ ప్రమాదం.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్.. 40 మంది ప్రాణాలు?
Also Read
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!