బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శ్రీలంక రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అయినా కుటుంబ పాలన వద్దని చెప్పానని పాల్ వెల్లడించారు. ఏపీకి అప్పులు భారంగా మారనున్నాయన్నారు.
తాను తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటు వరద బాధితులకు సహాయం చేస్తా అని అన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ఉండబోతోందని వెల్లడించారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని తెలిపారు. విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరద బాధితులు ఉన్నారని.. అయితే ఆదుకునే నాయకుడు…
హస్తిన వేదికగా ఆందోళనకు దిగారు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో మౌనదీక్ష చేపట్టారు.. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షకు దిగిన ఆయన.. మధ్యాహ్నం 3 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.. విభజన…
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి…
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు డప్పు కొడుతున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీనే దేశద్రోహి పార్టీ అంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి…
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు,…