Kasinadhuni Viswanath’s family introduces the Kasinadhuni Viswanath Award: కె విశ్వనాథ్ గా తెలుగు వారందరూ గుర్తించే శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి కుటుంబం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాలో చదివే వర్ధమాన ఫిలిం మేకర్స్ కి ‘కాశినాథుని విశ్వనాథ్ అవార్డు’ను ఇస్తున్నట్టు వెల్లడించింది. కాశీనాధుని విశ్వనాధ్ వారసత్వాన్ని స్మరించుకుంటూ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు ఉన్న మంచి రిలేషన్ ను పురస్కరించుకుని, విశ్వనాథ్ కుమారుడు కె నాగేంద్రనాథ్ తన తోబుట్టువులు & కుటుంబ…
చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా…
కాలం మారుతున్నా కట్నకానుకల ఊసు కరగిపోవడం లేదు. ఒకప్పుడు ‘కన్యాశుల్కం’, ఆ పైన ‘వరకట్నం’ అన్న దురాచారాలు జనాన్ని కుదిపేశాయి. వీటిని నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక చిత్రాలు వెలుగు చూశాయి. గురజాడ సుప్రసిద్ధ నాటకం ఆధారంగా తెరకెక్కిన పి.పులయ్య ‘కన్యాశుల్కం’, యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘వరకట్నం’ ఆ కోవకు చెందిన చిత్రాలే! కె.విశ్వనాథ్ కూడా 40 ఏళ్ళ క్రితం ఆ దిశగా పయనిస్తూ రూపొందించిన చిత్రం ‘శుభలేఖ’. అప్పట్లో వర్ధమాన…
తెలుగు సినిమా పాట అనగానే పల్లవి, కొన్ని సార్లు అనుపల్లవి ఆ తరువాత రెండు లేదా మూడు చరణాలు ఉండడం ఆనవాయితీ. ఇది మన దగ్గరే కాదు, పాటలతో చిందులు వేయించే ప్రతీచోటా ఉంటుంది. ఇలాంటి పదకవితలకు ఆద్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. అందుకే ఆయనను పదకవితాపితామహుడు అన్నారు. ఆయన పంథాలో పయనించని తెలుగు సినిమా రచయితలు లేరనే చెప్పాలి. అన్నమయ్య ఏర్పరచిన బాటలోనే తెలుగు సినిమా వెలుగు చూసిన తొలి రోజుల్లో పాటలు సాగాయి. అంటే ప్రాస,…
తెలుగు సినిమా రంగంలో ‘భీష్మాచార్యుడు’ అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.వి.యస్. రాజు. ఆయన తన అభిరుచికి తగ్గ చిత్రాలనే నిర్మిస్తూ సాగారు. యన్టీఆర్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన రాజు 1971లో రామారావు, జగ్గయ్యతో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ యువజంటగా అభినయించారు. ఆ చిత్రం నుంచీ శోభన్ బాబు, కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో సినిమాలు తీశారు డి.వి.యస్.రాజు. విశ్వనాథ్, శోభన్ బాబు కాంబోలో…
చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే…