(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో…