Hyderabad: తెలంగాణ దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తక్కువ కాలంలోనే వస్తు, సేవల పన్ను విషయంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. నాలుగేళ్లలో జిఎస్‌టి వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించడం ద్వారా ఇది స్పష్టమవుతోంది.
సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారంపై మరోసారి దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం.. వాటి పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కె. చంద్రశేఖర్ రావు.
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. అందులో భాగంగా రేపు జార్ఖండ్ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్.. శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న ఆయన.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.. ఇక, వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల…