Kolkata : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచింది. అయితే దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదు.
దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమాత విగ్రహాన్ని మార్చడంపై బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్పు చేసే ముందు తమ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మూడు వారాలు అవుతున్న న్యాయం కోసం డాక్టర్లు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో.. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
క్రిమినల్ కేసుల్లో బాలనేరస్తులకు బెయిల్ నిరాకరించొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర నేరస్థుడితో నైతిక, శారీరక సంబంధం, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్ నిరాకరించవద్దని స్పష్టం చేసింది.
తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన నిందితుడిపై తర్వగా చర్యలు తీసుకునేలా విచారణ చేపట్టాలని బాలీవుడ్ నటి అయేషా జుల్కా బొంబే హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం ఆమె పెంపుడు కుక్కను కేర్‌టేకర్ చంపేశాడు.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి రాజీనామా ప్రకటించారు.