ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
HYDRA : హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్న.. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించిన హైకోర్టు.. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని పేర్కొన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే హైడ్రా లక్ష్యమా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అనే…