Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.