జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో నిందితుల పేర్లను వెంటనే బయటపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఐదుగురు అమ్మాయిపై లైంగిక దాడి చేశారు.. దీనిపై గత నెల 28న అమ్మాయి ఫిర్యాదు చేస్తే మే 31 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మూడు రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సామూహిక లైంగిక దాడి కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని…