జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ (MG Comet EV Blackstorm) వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
JSW MG మోటార్స్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు నుండి పూర్తి పరిమాణ SUV సెగ్మెంట్ వరకు వాహనాలను అందిస్తుంది. మీరు ఫిబ్రవరి 2025లో కంపెనీకి చెందిన ఏదైనా SUV లేదా EV కొనుగోలు కోసం ప్లాన్ చేస్తే.. MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.