JSW MG: ఈ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఎంతో తెలిస్తే వెంటనే వెళ్లి కొనేస్తారు..!
- JSW MG మోటార్స్ నుంచి ఈవీలు, SUVలు
- ఫిబ్రవరి 2025లో SUV లేదా EV కొనాలని చూస్తే..
- MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JSW MG మోటార్స్ భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారు నుండి పూర్తి పరిమాణ SUV సెగ్మెంట్ వరకు వాహనాలను అందిస్తుంది. మీరు ఫిబ్రవరి 2025లో కంపెనీకి చెందిన ఏదైనా SUV లేదా EV కొనుగోలు కోసం ప్లాన్ చేస్తే.. MG మోటార్స్ లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో మీరు ఏ కారు పై ఎంత తగ్గింపు పొందవచ్చు అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం..
Read Also: Hyundai Exter: దుమ్మురేపే ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్స్.. ధర ఎంతంటే?
Also Read
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
1. JSW MG కామెట్ EV
దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును JSW MG కామెట్ EV రూపంలో అందిస్తోంది. మీరు ఫిబ్రవరి 2025లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. గరిష్టంగా రూ. 40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆదా దాని 2024 మోడళ్లపై అందించనుంది. 2025 లో తయారు చేసిన యూనిట్‌ను కొనుగోలు చేస్తే రూ. 35 వేల వరకు ఆఫర్లను అందిస్తోంది.
2. JSW MG ఆస్టర్ (మిడ్-సైజు SUV)
JSW MG ఆస్టర్ మిడ్-సైజు 2024 మోడల్స్ పై రూ.1.45 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. అదే 2025 మోడల్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలో గరిష్టంగా రూ. 50,000 వరకు ఆదా చేయవచ్చు.
3. JSW MG హెక్టర్
JSW MG హెక్టర్ 2024 హెక్టర్ డీజిల్ మోడల్ పై రూ.2 లక్షలు వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ నెలలో పెట్రోల్ యూనిట్లపై రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
4. కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లు లేవు
JSW MG విండ్సర్, JSW MG గ్లోస్టర్ మోడల్స్ పై ఈ నెలలో ఎటువంటి డిస్కౌంట్లు అందించడం లేదు.
ఈ నెలలో మీరు MG కార్లను కొనుగోలు చేయాలనుకుంటే.. వివిధ మోడల్స్ పై గొప్ప ఆఫర్లను పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే షోరూంను సంప్రదించి మీకు నచ్చిన కారును తీసుకొచ్చుకోండి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?