Nayantara: నయనతార ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్. ఆమె తమిళంలో శరత్‌కుమార్ సరసన అయ్యా చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రజనీకాంత్‌తో చంద్రముఖి సినిమాలో నటించింది. చంద్రముఖి సినిమా ఏడాది పాటు థియేటర్లలో రన్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.