జర్నలిజం డెఫినేషన్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. వాళ్లు, మీరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.