ఆపదలోనైనా ప్రజలకు మేమున్నామంటూ చేదోడుగా నిలిచి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రధానోత్సవ సమావేశం జరిగింది. ఆర్‌ఎస్‌ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి…