“జోధా అక్బర్” సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (మే 7)న కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో “జోధా అక్బర్” చిత్రం కోసం నిర్మించిన శాశ్వత సెట్ లో మంటలు చెలరేగాయి. మొత్తం సెట్ నిప్పుల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన చారిత్రాత్మక…