‘జోధా అక్బర్’ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“జోధా అక్బర్” సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు (మే 7)న కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో “జోధా అక్బర్” చిత్రం కోసం నిర్మించిన శాశ్వత సెట్ లో మంటలు చెలరేగాయి. మొత్తం సెట్ నిప్పుల్లో కాలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘జోధా అక్బర్’. ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ కోసం 2007లో ఈ సెట్ ను నిర్మించారు. తరువాత ఏక్తా కపూర్ నిర్మించిన బుల్లితెర చారిత్రక డ్రామా ‘జోధా అక్బర్’ సీరియల్ షూటింగ్ కూడా 2013- 2014 మధ్య ఇక్కడే చిత్రీకరించబడింది. ఈ కార్యక్రమంలో రజత్ తోకాస్, పరిధి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ కారణంగా ఎటువంటి సినిమా లేదా సీరియల్స్ షూటింగులు జరగట్లేదు. దీంతో ఆ భారీ సెట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై నుంచి మంటలు స్టూడియో గోడలను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ‘జోధా అక్బర్’ సెట్ ను సందర్శకుల కోసం శాశ్వత సెట్‌గా మార్చేశారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఈ సెట్ ను నిర్మించారు.
Also Read
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?