దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ విదేశీ ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 100 మందికి పైగా మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.