ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెంటనే విడుదల…
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేయాలని నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. నిరుద్యోగుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలలోని విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందస్తుగా పలు చోట్ల విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: Pawan Kalyan:…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రేపో.. మాపో మరో 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త జోనల్ విధానంతో యువతకు కావాల్సిన హక్కులు సాధించామని ఆయన తెలిపారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5శాతం మాత్రమే నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని కేసీఆర్…
సీఎం కేసీఆర్, పీఎం మోడీ ఉద్యోగాల భర్తీ నీ మర్చిపోయారు అని సీనియర్ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. తెలంగాణలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాల ఖాళీల పై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇక బండి సంజయ్ నిరుద్యోగుల గురించి మిలియన్ మార్చ్ అంటే నవ్వు వస్తోంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని..ఇవ్వని బీజేపీకి మిలియన్ మార్చ్ నిర్వహించే హక్కు ఎక్కడిది అని…