రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు.