తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదేశానికి ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందన్నారు. రైతుల రుణమాఫీ చేయని…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్…
ఇక, ఖాళీల భర్తీకై వార్షిక నియామక కేలెండర్ (జాబ్ క్యాలెండర్ ) విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.. ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్… సుదీర్ఘంగా ఏడు గంటలకు పైగా సాగింది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్‌జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.. 2021-22లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించనున్నారు.. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్రమంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.. మొత్తంగా…