రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
2020లో కొవిడ్ ఎంతటి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల పాటు ప్రపంచాన్నే చెడుగుడు ఆడుకున్న కరోనా.. మళ్లీ కోరలు చాస్తుంది. అయితే అందరూ ఇక కరోనా అంతమైపోయిందనుకున్నప్పటికీ.. మరో కొత్తరకం వేరియంట్ కలవరపెడుతుంది. జేఎన్ 1 రకానికి చెందిన కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.