జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్గాం అసెంబ్లీ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. కుటుంబానికి కంచుకోటగా ఉన్న గండర్‌బాల్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దు్ల్లా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.