2024-25 ఆర్థిక సంవత్సరానికి పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు గుర్తింపుగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులకు "సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్"ను ప్రదానం చేసింది. జూలై 24, 2024న న్యూఢిల్లీలో జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఐసీఎస్ స్వీకరించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా హాజరై గుర్తింపు పత్రాన్ని అందించారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఐదోసారి విచారణకు హాజరయ్యారు. బుధవారం (జూన్ 19) ఆయనను సిట్ అధికారులు సుమారు 9 గంటలపాటు విచారించారు. అయితే ఈ విచారణలో ప్రభాకర్ రావు పలు కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. దీంతో సిట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ సీరియస్‌గా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్, నేడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిపించింది. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఎనిమిది గంటల పాటు మాజీ ఇంటలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్, ఆయన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్…